ఫ్లైట్లో పక్కసీటులో ఆమెతో అసభ్యంగా....
ఫ్లైట్లో పక్క సీటు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి... చివరికి గన్నవరం పోలీస్ స్టేషన్‌కు చేరిన ఓ ప్రభుద్దుడి కథ ఇది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన కుమ్మరి లక్ష్మణ్ మస్కట్ నుంచి హైదరాబాదుకు వస్తున్నాడు. చాలా ఏళ్ళ తర్వాత స్వస్థలానికి వస్తున్నలక్ష్మణ్... తన మానాన తాను ఫ్లయిట్లో కూర్చోకుండా... పక్క సీట్లో ఉన్న మహిళను అసభ్యంగా తాకాడు. అంతే... కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ పాలయ్యాడు.
గన్నవరం విమానాశ్రయానికి మస్కట్ నుండి వయా గన్నవరం మీదుగా హైదరాబాద్ విమానాశ్రయం వెళ్తున్న హైదరాబాద్‌కు చెందిన మహిళను అదే విమానంలో ప్రయాణం చేస్తున్నపక్క సీట్లో కూర్చున్న లక్ష్మణ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె శరీర భాగాలను తాకుతూ, శారీరకంగా కూడా హింసించడంతో బాధిత మహిళ గన్నవరం విమానాశ్రయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో లక్ష్మణ్‌ను విమానం నుంచి అర్ధంతరంగా దించేశారు.
బాధిత మహిళ ఫిర్యాదుతో నిందితుడు లక్ష్మణ్‌ని ఎయిర్పోర్ట్ అధికారులు గన్నవరం పోలీసులకు అప్పగించారు. నిందితుడి పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ఇపుడు గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు...కాగా, లక్ష్మణ్‌ని పోలీసులు విచారిస్తున్నారు.