బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 26 నవంబరు 2024 (15:53 IST)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా?

chevireddy
వైసిపి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసారు పోలీసులు. ఆమధ్య తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన ఓ బాలికపై అత్యాచారం జరిగిందంటూ చెవిరెడ్డి తప్పుడు ప్రచారం చేసారంటూ ఈ కేసు ఆయనపై నమోదైంది. కాగా ఆ బాలిక కొద్దిరోజుల క్రితం ఇంటికి తిరిగిరాలేదు. కంగారుపడ్డ ఆమె తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో ఆమె రోడ్డు పక్కనే గాయాలపాలై కనిపించింది.
 
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐతే అక్కడికి వెళ్లిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ బాలికపై అత్యాచారం జరిగిందనీ, వారి వివరాలు వెల్లడించారంటూ కేసు ఫైల్ అయ్యింది. ఎలాంటి అఘాయిత్యం జరక్కపోయినా జరిగిందంటూ చెవిరెడ్డి అసత్య ప్రచారం చేసి తమ పరువుప్రతిష్టలకు భంగం కలిగించారంటూ చెవిరెడ్డిపై బాలిక తండ్రి ఫిర్యాదు చేసారు. దీనితో పోలీసులు చెవిరెడ్డిపై కేసు నమోదు చేసారు.