బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (12:43 IST)

ఏపీ ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ (ప్రజా వ్యవహారాలు) సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం ఈనెల 18వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది.

అలాగే ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం పదవీ కాలం ఈ నెల 4వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది.