శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 11 జూన్ 2021 (19:25 IST)

తొలిరాత్రి భర్త కోసం ఎదురుచూస్తున్న భార్య, వెనగ్గా వచ్చి ఆ మాట చెప్పాడు, భార్య షాక్

లక్షల్లో కట్నం.. అందులోను ఎన్ఆర్‌ఐ సంబంధం. కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆ యువతికి తొలిరాత్రి చేదు అనుభవం ఎదురైంది. తను సంసారానికి పనికిరానంటా భర్తే స్వయంగా చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది భార్య. తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకునేందుకు యువతి పుట్టింటికి వెళ్ళిపోయింది. భర్త అత్తమామల నుంచి వేధింపులు ఎదురవ్వడంతో చివరికి తల్లిదండ్రుల సహాయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
 
తెనాలి పాండురంగపేటకు చెందిన ఎండి జలాలుద్దీన్‌కు ముగ్గురు ఆడపిల్లలు. మూడవ కుమార్తెను విజయవాడ ఆటోనగర్‌కు చెందిన ఖాన్‌తో పెళ్ళి చేశారు. కెనడాలో ఖాన్‌కు ఉద్యోగం ఉందని చెప్పడంతో ఎన్ఆర్ఐ సంబంధమని సంబరపడి పెళ్ళి చేశారు.
 
15 లక్షల రూపాయల కట్నం, 8 లక్షల రూపాయల లాంఛనాలతో పెళ్లి చేశారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో భర్త చెప్పిన మాటలతో భార్య షాక్‌కు గురైంది. తను సంసారానికి పనికిరారని.. కొద్దిరోజుల్లో కెనడా వెళ్ళి అక్కడే ఉంటానని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక తల్లిదండ్రులకి చెప్పింది.
 
ఫస్ట్ నైట్ ఈ విషయాన్ని చెప్పిన భర్త ఆ తరువాత భార్యను ప్రాధేయపడి నచ్చజెప్పి ఇంట్లోనే పెట్టుకున్నాడు. కానీ  ఎందుకూ పనికిరాని భర్తతో ఉండలేనని తెలుసుకున్న యువతి అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చి తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.