శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 11 జూన్ 2021 (18:12 IST)

నా భార్య అందగత్తె, 25 వేలకు ఇద్దరు స్నేహితులకు ఆఫర్ ఇచ్చిన భర్త

భర్త అంటే భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మద్యానికి బానిసైన ఒక భర్త తన భార్యను ఏకంగా అమ్మకానికి పెట్టాడు. అంతేకాదు తన భార్య చాలా అందగత్తె. మీరు ప్రొసీడ్ అవ్వండి నేను చూసుకుంటానంటూ శపథాలు చేశాడు. అది కూడా స్నేహితులకే. అందంగా ఉన్న వివాహితను చూసిన వారు ఆమెను లైంగికంగా వేధించడం మొదలెట్టారు. చివరకు ఆ అభాగ్యురాలు పోలీసులను ఆశ్రయించింది. 
 
తమిళనాడు రాష్ట్రం కడలూరు పోలీస్టేషన్ పరిధిలోని ఎల్ఆర్ పాలెంలో మధసూదన్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఇతనికి 2018 సంవత్సరంలో పార్వతి అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ళ కొడుకు ఉన్నాడు. అయితే మధుసూదన్ మద్యానికి బానిసయ్యాడు.
 
ఉన్నడబ్బులంతా తాగుడుకు ఖర్చుపెట్టేశాడు. డబ్బు కోసం తన ఇద్దరు స్నేహితులు సుందరమూర్తి, మణికంఠన్‌ల వద్ద 25 వేల రూపాయలు అప్పు చేశాడు. అప్పు చేసి సంవత్సరం అవుతున్నా చెల్లించలేదు. దీంతో స్నేహితులు నిలదీశారు. ఈ నెల 2వ తేదీన తన భార్య ఫోటోలను స్నేహితులకు చూపించాడు.
 
తన భార్య ఎంతో అందగత్తె అని తాను ఒప్పించి మీతో సంబంధం కలుపుతానన్నాడు. దాంతో ఆ ఇద్దరు ఒకే చెప్పేశారు. ఈ నెల 4వ తేదీ తన కొడుక్కి, భార్యకు మత్తు మందు ఇచ్చాడు. స్పృహ తప్పి పడిపోయిన తరువాత తన బెడ్ రూంలో ఉంచి స్నేహితులకు ఫోన్ చేశాడు.
 
ఇద్దరు స్నేహితులు ఇంటికి వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న మహిళపై అత్యాచారం చేశారు. ఆ తరువాత మెళుకువ వచ్చిన మహిళ తను అత్యాచారానికి గురయ్యాయని తెలుసుకుంది. భర్తను నిలదీసింది. అప్పు చేశాను.. నిన్ను అమ్మేశాను అన్నాడు. దీంతో ఆగ్రహంతో భర్తతో గొడవకు దిగింది. 
 
కొడుకు ఎంతకూ లేవకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చేర్పించి నేరుగా పోలీసు స్టేషన్‌లో జరిగిన విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేసింది. నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.