మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 22 జనవరి 2021 (15:12 IST)

జగన్ సర్కార్‌కి మరో షాక్, ఆదివారం నిమ్మగడ్డ ఉత్తర్వులు

స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని, దానిని సరిచేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే పిటీషన్‌ను వెనక్కిచ్చేసింది.
 
ఈ క్రమంలో మళ్లీ ఈరోజే రిజిస్ట్రీ పిటిషన్‌ను సరిచేసి దాఖలు చేయలేకపోవచ్చని వైసీపీ లాయర్లు చెబుతున్నారు. దీనివల్ల సోమవారం వరకు పిటీషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది.
 
అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఆదివారమే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ పిటీషన్ దాఖలు చేసే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.