వైసీపీ నాయకుడు నిరుద్యోగులకు టోకరా, అడిగితే బెదిరిస్తున్నాడు
విజయనగరం జిల్లాలోని వైసీపీ నాయకుడు నిరుద్యోగులకు టోకరా వేశాడు. బాడంగికి చెందిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి పెద్దింటి రామారావు ఎఫ్‌సీఐలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు.
ఒక్కొక్కరి నుంచి రూ. 15 నుంచి 25 లక్షల వరకు వసూలు చేశాడు. మోసాన్ని గ్రహించిన బాధితులు డబ్బు తిరిగి ఇవ్వాలంటూ రామారావు చుట్టూ తిరుగుతున్నా.. మొహం చాటేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.