శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (13:16 IST)

మరణంలోనూ వీడని స్నేహబంధం.. కొత్తగూడెంలో విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం జరిగింది. ప్రాణస్నేహితులను రోడ్డు ప్రమాదం పొట్టనబెట్టుకుంది. ఎక్కడికెళ్లినా ఒకే బైకులో వెళ్లే వీరు రోడ్డు ప్రమాదంలో ఒకేసారి కన్నుమూశారు. ఈ స్నేహితుల మరణాన్ని జీర్ణించుకోలేక వారి కుటుంబ సభ్యులో కాదు స్నేహితులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండటం నందిపాడు గ్రామానికి చెందిన కిశోర్ బాబు, కారం వీరభద్రం, జోగారావు, ముక్తేశ్వరరావు అనే నలుగురు మిత్రులు ఉన్నారు. వీరంతా ఆదివారం కావటంతో వీరంతా కలిసి రెండు బైకులపై ఊరికి సమీపంలో ఉన్న కుడుములపాడు వెళ్లి అల్పాహారం ఆరగించారు. అక్కడ చిన్నపని ముగించుకుని ఇంటికి తిరిగి పయనమయ్యారు. ఓ రోడ్డు మలుపు వద్ద వీరి బైకులు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కిశోర్, వీరభద్రం, జోగారావు తుదిశ్వాస విడువగా, ముత్తేశ్వర రావు మాత్రం అదే ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో వీరభద్రానికి వివాహం కాగా, ఏడాదిన్నర వయసున్న కుమార్తె, భార్య కూడా వున్నారు. 
 
కిశోర్, జోగారావులకు ఇంకా పెళ్లి కాలేదు. మరణించిన ముగ్గురు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. కిశోర్ అశ్వారావుపేటలో బీఈడీ చదువుతుండగా, వీరభద్రం బీఈడీ పూర్తి చేసి ప్రస్తుతం క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. జోగారావు పోలవరం ప్రాజెక్ట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ముగ్గురు మిత్రులు ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.