శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 22 మార్చి 2018 (22:20 IST)

శ్రీకాళహస్తిలో ముగ్గురు కానిస్టేబుళ్ళు ఒక యువతిని....

సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కానిస్టేబుళ్ళు మద్యం మత్తులో నడిరోడ్డుపై యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె బట్టలను లాగి నగ్నంగా చేశారు.

సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కానిస్టేబుళ్ళు మద్యం మత్తులో నడిరోడ్డుపై యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె బట్టలను లాగి నగ్నంగా చేశారు. అది కూడా ఎక్కడో కాదు ముక్కంటీశ్వరుడు కొలువై ఉన్న శ్రీకాళహస్తిలోనే. 
 
శ్రీకాళహస్తిలోని నడివీధికి చెందిన మీనా... నగరంలోని ఒక ప్రైవేటు గాజుల దుకాణంలో పనిచేస్తోంది. నిన్న రాత్రి 10 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వెళుతోంది. మార్గమధ్యంలో ముగ్గురు కానిస్టేబుళ్ళు విధులు నిర్వహిస్తూ మీనాను రమ్మని పిలిచారు. పోలీసులే కదా అని వెళితే వారు మీనాతో అసభ్యంగా ప్రవర్తించారు. 
 
అంతటితో ఆగలేదు..ఆమె వేసుకున్న చుడీదార్‌ను చించేశారు. ఇదంతా నడిరోడ్డుమీదే జరిగింది. జనం మొత్తం చూస్తున్నా పోలీసులు కావడంతో ఏమీ చేయలేక అలాగే ఉండిపోయారు. చివరకు మీనా వారి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ముగ్గురు కానిస్టేబుళ్ళపై టుటూన్ పోలీసులు కేసు పెట్టారు. కానీ అప్పటికే ముగ్గురు పరారైపోయారు.