శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 19 మార్చి 2018 (15:13 IST)

మోడీ అన్నా.. ఒక్కసారి రా... చీర కట్టులో శివప్రసాద్

ప్రత్యేక హోదా కోసం వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు చిత్తూరు ఎంపి శివప్రసాద్. రకరకాల వేషధారణలతో పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు. బిజెపి టిడిపి పూర్తిగా తెగతెంపులు చేసుకున్న తరువాత మోడీపై పదునైన విమర్శలు చేస్తున్నారు శివప్రసాద్. మోడీ పతనం ప్రారంభమ

ప్రత్యేక హోదా కోసం వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు చిత్తూరు ఎంపి శివప్రసాద్. రకరకాల వేషధారణలతో పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు. బిజెపి టిడిపి పూర్తిగా తెగతెంపులు చేసుకున్న తరువాత మోడీపై పదునైన విమర్శలు చేస్తున్నారు శివప్రసాద్. మోడీ పతనం ప్రారంభమైందని మండిపడ్డారు శివప్రసాద్.
 
అయితే పార్లమెంటు సమావేశాలకు హాజరైన శివప్రసాద్ వినూత్నంగా మహిళలా చీర కట్టుకుని సిగ్గుపడుతూ పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఎపి మహిళందరూ మోడీ అన్నా ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తావన్నా అంటూ అడుగుతున్నారు. మీరెందుకు ఇవ్వడం లేదు అంటూ ప్రశ్నించారు. అన్నా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాకి రా.. మా బాధల్ని చూడు అంటూ శివప్రసాద్ వినూత్నంగా నినాదాలు చేస్తూ పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. శివప్రసాద్ వేషధారణను పార్లమెంటు సమావేశాలకు హాజరైన ఎంపిలు, అక్కడి సిబ్బంది ఆసక్తిగా తిలకించారు.