1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (12:58 IST)

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : ప్లీనరీలో కాంగ్రెస్ తీర్మానం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో చర్చకు వచ్చింది. ప్లీనరీ రాజకీయ తీర్మానంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇప్పటివరకూ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో చర్చకు వచ్చింది. ప్లీనరీ రాజకీయ తీర్మానంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇప్పటివరకూ ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. 
 
విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రకటించినప్పుడు భాజపా సహా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని కాంగ్రెస్‌ గుర్తు చేసింది. ఏపీ ప్రత్యేక హోదాకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని తీర్మానంలో పేర్కొంది.
 
విభజన చట్టంలోని హామీలను ఎన్డీయే విస్మరించిందని కాంగ్రెస్‌ విమర్శించింది. తాము అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేస్తామంటూ తీర్మానం చేసింది. 2014 ఫిబ్రవరి 20న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంట్‌లో ప్రకటించారని కాంగ్రెస్‌ పేర్కొంది.