సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2024 (16:50 IST)

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

Tirumala ghat Road
Tirumala ghat Road
ఫెంగల్ తుపాను ఏపీ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాను అతలాకుతలం చేస్తోంది. అటు తిరుమల కొండపైనా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల ఘాట్ రోడ్డులో కొందరు యువకుల హల్ చల్ చేశారు. కారు డోర్లు ఓపెన్ చేసి అరుపులు, కేకలు వేశారు. 
 
వర్షంలో తడుస్తూ.. సెల్ఫీలు తీసుకుంటూ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. యువకులు చేసిన హంగామాతో తోటి వాహనదారులు, భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. సదరు యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  కారు సన్ రూఫ్, కిటికీల నుంచి నిలబడి సెల్ఫీలు దిగుతూ విన్యాసాలు చేయడంతో యువకులపై తిరుమల పోలీసులు సీరియస్ అయ్యారు. ఇంకా యువకులను అరెస్టు చేసిన పోలీసులు కారును సీజ్ చేశారు.