ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 జులై 2022 (22:23 IST)

రూ.6 కోట్ల మార్క్‌ను దాటేసిన వెంకన్న హుండీ ఆదాయం

venkateswara swamy
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల కానుకలు రికార్డులు బద్ధలు కొట్టాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఆదివారం ఒక్క‌రోజే ఏకంగా రూ.6 కోట్ల‌కు పైగా హుండీ ఆదాయం ల‌భించింది. ఈ మేర‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 
 
తిరుమ‌ల చ‌రిత్ర‌లో ఇప్ప‌టిదాకా ఒక రోజులో ల‌భించిన అత్య‌ధిక హుండీ ఆదాయంగా ఆదివారం నాటి హుండీ ఆదాయం రికార్డుల‌కెక్క‌నుంది.
 
ఆదివారం నాటి విరాళాల విలువ రూ.6.18 కోట్లుగా తేలింది. ఇప్ప‌టిదాకా తిరుమ‌ల వెంక‌న్న హుండీకి ఒక‌రోజు అత్య‌ధికంగా ల‌భించిన ఆదాయం రూ.5.73 కోట్లే. ఈ హుండీ ఆదాయం 2012 ఏప్రిల్ 1న ల‌భించింది. తాజాగా తిరుమ‌ల చ‌రిత్ర‌లోనే వెంక‌న్న హుండీ ఆదాయం రూ.6 కోట్ల మార్క్‌ను దాటేసింది.