శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 29 ఆగస్టు 2017 (13:52 IST)

తిరుపతిలో భారీ సెక్స్ రాకెట్... వెంకయ్య దర్శనానికి వచ్చి...(వీడియో)

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతిని కొంతమంది వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేస్తున్నారు. భక్తులనే టార్గెట్ చేస్తూ వ్యభిచార గృహాలను నడిపేస్తున్నారు. కొంతమంది ప్రైవేటు లాడ్జి యజమానులతో కుమ్మక్కవుతున్న వ్యభిచార గృహ నిర్వాహకులు మహిళలను మభ్యపెట్టి

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతిని కొంతమంది వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేస్తున్నారు. భక్తులనే టార్గెట్ చేస్తూ వ్యభిచార గృహాలను నడిపేస్తున్నారు. కొంతమంది ప్రైవేటు లాడ్జి యజమానులతో కుమ్మక్కవుతున్న వ్యభిచార గృహ నిర్వాహకులు మహిళలను మభ్యపెట్టి లక్షల రూపాయలు సంపాదించేస్తున్నారు. 
 
తిరుపతిలోని సాయి అమృత లాడ్జి, సాయి విజయ, అశోక రెసిడెన్సీ, హరిచరణ్‌ లాడ్జిలలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేయగా 10 మంది యువతులు, 10 మంది విటులు కనిపించారు. ఉద్యోగాల పేరుతో యువతులను మభ్యపెట్టి పడుపు వృత్తిలోకి కొంతమంది వ్యభిచార నిర్వాహకులు దించుతున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
దీంతో 10 మంది యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేసిన పోలీసులు విటులను, లాడ్జి యజమానులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన విటులందరూ పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చిన వారుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు చెప్పిన వివరాలు... వీడియో...