మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (15:03 IST)

సీఎం జగనన్న బాదుడుతో శ్రీవారి భక్తులపై మరింత భారం

Tirumala Ghat Road
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను భారీగా పెంచేసింది. ప్రయాణ చార్జీల పేరిట కాకుండా డీజిల్ సెస్ పేరుతో చార్జీలను బాదేశారు. ఈ భారం కనిష్టంగా రూ.5 గరిష్టంగా రూ.80 చొప్పున ఉంది. ఈ పెంపుతో శ్రీవారి భక్తులపై ప్రయాణ భారం పడింది. 
 
తిరుమల - తిరుపతి ఘాట్‌ రోడ్డు ప్రయాణానికి ఒక్కో టిక్కెట్‌పై అదనంగా రూ.15 పెరిగింది. గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ టిక్కెట్ ధర రూ.75గా ఉంటే ఇపుడు ఇది రూ.90కి చేరింది. డీజిల్ సెస్ పేరుతో పెంచిన చార్జీలు జూలై ఒకటో తేదీ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులో మినహా మిగిలిన బస్సులో ఈ ప్రయాణ చార్జీలు విపరీతంగా పెంచేశారు.
 
తిరుపతి - తిరుమల ప్రాంతాల మధ్య పిల్లల టిక్కెట్ రూ.45గా ఉంటే ఇపుడు అది రూ.50కి చేరింది. రానుపోను టిక్కెట్ ధరలో రూ.130గా ఉంటే ఇపుడది రూ.160కి పెంచేశారు. 2018లో తిరుమల తిరుపతి ప్రాంతాల మధ్య టిక్కెట్ ధర రూ.50గా ఉంటే గత నాలుగేళ్ల కాలంలో రూ.40కి పైగా పెరగడం గమనార్హం.