శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (13:17 IST)

తిరుపతి కోర్టుకు మంచు మోహన్... ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని..?

mohanbabu
తిరుపతి కోర్టుకు ప్రముఖ నటుడు మంచు మోహన్ ఆయన హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం మోహన్ బాబు న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. 
 
ఆయనతో పాటు కుమారులు మంచు విష్ణు, మనోజ్ కూడా కోర్టుకు వచ్చారు. 2019 మార్చి 22వ తేదీన అప్పటి సర్కారు ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించలేదని మోహన్ బాబు కుటుంబం తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. 
 
కానీ సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో వుండటంతో కోడ్ ఉల్లంఘన కింద మోహన్ బాబు, ఆయన కుమారులు విష్ణు మనోజ్, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థ ఏవో తులసి నాయుడు, పీఆర్వో సతీష్ పై కేసు నమోదైంది.  ధర్నాకు పోలీసుల అనుమతి తీసుకోలేదని వీరిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.