శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (17:43 IST)

మలయాళ నటుడు ఎన్‌డీ ప్రసాద్ ఆత్మహత్య .. ఇంట్లోనే ఉరేసుకుని...?

biju actor
biju actor
మలయాళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నటుడు ఎన్‌డీ ప్రసాద్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నివిన్‌ పౌలీ హీరోగా నటించిన `యాక్షన్‌ హీరో బీజు చిత్రంతో విలక్షన్‌గా నటించిన ఎన్‌డీ ప్రసాద్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇబా, "కిర్మాణి" వంటి సినిమాలు చేసిన ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు
 
కొచ్చిలోని కలస్సేరి ప్రాంతంలో తన ఇంట్లో ఉరేసుకుని రెండు రోజుల క్రితం (జూన్‌ 25) బలవన్మరణానికి పాల్పడ్డాడు. మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలే కారణమని ప్రాథమికంగా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్‌డీ ప్రసాద్‌ గతంలో పలు నేరాల్లో నిందితుడుగానూ ఉన్నాడు. 
 
గతంలో డ్రగ్స్‌తో పట్టుపడటంతోపాటు పలు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొన్నాడు. అలాగే గతేడాది ఎర్నాకుళం ఎక్సైజ్‌ సర్కిల్‌ అధికారులు నిర్వహించిన దాడిలో 15 గ్రాముల గంజాయి, 2.5గ్రాముల హాష్‌  ఆయిల్‌, 0.1 గ్రాముల బుప్రెనార్ఫిన్‌, కొడవలితో పట్టబడినట్టు సమాచారం. దీంతోపాటు సినిమాల్లోకి రాకముందు పలు పోలీస్‌ స్టేషన్లలో ఆయనపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.