1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 7 జులై 2021 (22:31 IST)

ఏపీలో 16 మంది ఐపీఎస్‌ల‌కు స్థాన చ‌ల‌నం

ఏపీలో తాజాగా 16 మంది ఐపీఎస్ ల‌ను బ‌దిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ ఈ ఉత్తర్వులిచ్చారు. విజయనగరం ఎస్పీ రాజకుమారికి డీఐజిగా పదోన్నతి క‌ల్పించారు. ఆమెను దిశా డీఐజీగా నియమించారు. డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ డీఐజీ గానూ రాజకుమారికి బాధ్యతలు ఇచ్చారు. అలాగే, విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక బదిలీ అయ్యారు. సి.హెచ్.విజయరావును నెల్లూరు ఎస్పీగా బదిలీ చేశారు. కృష్ణా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబును తూ.గో. జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు.
 
అద్నాన్ నయీమ్ హస్మిని గ్రే హౌండ్స్ కమాండర్‌గా బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్‌ కౌశల్‌ నియామకం అయ్యారు. రిశాంత్‌రెడ్డి గుంటూరు జిల్లా అడ్మిన్‌ అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు.
 
సతీశ్‌కుమార్‌కు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీగా బదిలీ అయింది. విద్యాసాగర్‌ నాయుడుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. వై.రిశాంత్ రెడ్డిని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ అడ్మిన్​గా​ పోస్టింగ్ ఇచ్చారు. ఎస్ .సతీష్ కుమార్ ని స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా నియామకం చేశారు. విద్యాసాగర్ నాయుడును ఎస్ఈబీ అదనపు ఎస్పీగా నియమించారు. గరికపాటి బిందు మాధవ్​ను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. తుహిన్ సిన్హాను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. పి జగదీష్ను​ విశాఖపట్నం జిల్లా, పాడేరు సహాయ ఎస్పీగా బదిలీ చేశారు. జి కృష్ణకాంత్​ను తూర్పుగోదావరి జిల్లా, చింతూర్ సహాయ ఎస్పీగా బదిలీ చేశారు.
 
వి ఎన్ మణికంఠ ఛందోలును విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేశారు. 
కృష్ణకాంత్ పాటిల్ తూర్పుగోదావరి జిల్లా, రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ అయ్యారు. తుషార్ దూడిని విశాఖపట్నం జిల్లా, చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేశారు.