గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 26 ఆగస్టు 2021 (15:46 IST)

ట్రావెల్స్ బ‌స్సులోకి దూసుకుపోయిన ఇనుప‌ చువ్వ‌లు!

జాతీయ ర‌హ‌దారుల‌పై నిత్యం ప్ర‌యివేటు బ‌స్సుల ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఎక్క‌డో అక్క‌డ బ‌స్సులు బోల్తా ప‌డ‌టం, లారీల‌ను వెనుక నుంచి గుద్ద‌డం ప‌రిపాటిగా మారింది. మితిమీరిన వేగం, డ్రైవ‌ర్ల నిర్ల‌క్ష్యం ప్ర‌యాణికుల‌కు శాపంగా మారింది. 
 
కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం జాతీయ రహదారి ఫ్లై ఓవర్ పై  రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి యానం వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్ర‌మాదానికి గురైంది. బ‌స్సు 38 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుండగా, డ్రైవర్  నిద్ర మత్తులో అతి వేగాన్ని అదుపు చేయలేక ఎదురుగా వెళుతున్న లారీని ఢీకొట్టాడు.

ఇనుప సువ్వల లోడ్ తో  ముందు వెళుతున్న లారీని  కావేరి ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటన లో ముగ్గురుకు ప్రయాణికులకు గాయాలు కాగా,  డైవర్ కి తీవ్రంగా గాయాల‌య్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108 వాహనం ద్వారా గాయాలైన వారిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మిగిలిన ప్రయాణికుల‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు దింపారు. పెద్ద  ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకొని మరో బస్సులో మిగిలిన 34 మందిని వారివారి గమ్య స్థానానికి చేర్చారు. కేవలం డ్రైవర్  నిర్లక్ష్యం వల్ల, నిద్ర మత్తులో అతివేగం అదుపు చేయలేక లారీని ఢీకొన్న ట్లుగా ప్రయాణికులు వివ‌రించారు.