తిరుచానూరు రైల్వేస్టేషన్‌కు పద్మావతి అమ్మవారి పేరు : తితిదే ఛైర్మన్
తిరుచానూరు రైల్వేస్టేషన్‌కు పద్మావతి అమ్మవారి పేరును కేంద్ర రైల్వేశాఖ ఖరారు చేసినట్లు తితిదే పాలకమండలి ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి తెలిపారు. తిరుపతిలోని రైల్వేస్టేషన్ పాటు ఈస్ట్, చంద్రగిరి, రేణిగుం
తిరుచానూరు రైల్వేస్టేషన్‌కు పద్మావతి అమ్మవారి పేరును కేంద్ర రైల్వేశాఖ ఖరారు చేసినట్లు తితిదే పాలకమండలి ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి తెలిపారు. తిరుపతిలోని రైల్వేస్టేషన్ పాటు ఈస్ట్, చంద్రగిరి, రేణిగుంట రైల్వేస్టేషన్ల అభివృద్ధికి తితిదే 3 ఎకారాల స్థలాన్ని దక్షిణ మధ్య రైల్వేకు అందిస్తున్నట్టు చెప్పారు. త్వరలో తిరుపతి వెస్ట్ రైల్వేస్టేషన్‌లో ఒక ఫ్లాట్‌ఫాం, ఈస్ట్ పరిధిలో రెండు రైల్వేఫ్లాట్‌ఫాంలు, చంద్రగిరిలో మరో రెండు ఫ్లాట్‌ఫాంలను దక్షిణ మధ్య రైల్వే నిర్మించనుందని తెలిపారు.
కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభు శ్రీవారి భక్తులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రైల్వేశాఖ ఫ్లాట్ ఫాంలు పూర్తి చేసిన వెంటనే తిరుచానూరులో భక్తుల కోసం వసతి సముదాయలను ఏర్పాటు చేస్తామన్నారు. తితిదే చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా చిత్తూరు జిల్లాలోని స్థానిక ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ పెరుగుతోందన్నారు.
ఢిల్లీలోని తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో చేరాలంటే ఈనెల 19వ తేదీ వరకు విద్యార్థినీ, విద్యార్థులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను అందిస్తున్నామన్నారు. కళాశాలలో చేరాలనుకునే విద్యార్థులు తమ పూర్తి సమాచారాన్ని డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.ఢిల్లీ.ఎసి.ఇన్‌కు లాగినై ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సీఎం ఆదేశాల మేరకు తితిదే కళాశాలలో సీట్లను మరింత పెంచనున్నట్లు తితిదే ఛైర్మన్ వెల్లడించారు.