తిరుమలలో గదుల అద్దె భారీగా పెంచేశారు...

tirumala temple
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 8 నవంబరు 2019 (11:40 IST)
ప్రఖ్యాత పుణ్యస్థలం తిరుమలలో తితిదే ఆధ్వర్యంలో ఉన్న వివిధ సముదాయాల గదుల అద్దెను భారీగా పెంచేశారు. ఇప్పటివరకు ఉన్న అద్దెను ఇపుడు రెట్టింపు చేశారు. దీంతో గదుల ద్వారా వచ్చే కలెక్షన్ కూడా రెట్టింపు అయింది.

తిరుమలలో వివిధ సముదాయాల్లోని 952 వసతి గదుల ఉన్నాయి. పాంచజన్యంలో 383, కౌస్తుభంలో 229, నందకంలో 340 గదులు
ఉండగా, ఒక్కో గదికి నందకంలో రూ.600, పాంచజన్యం, కౌస్తుభంలలో రూ.500 చొప్పున అద్దె వసూలు చేసేవారు.

అయితే, గదుల నిర్వహణ ఖర్చులు పెరగడంతో అద్దె కూడా పెంచాలని తితిదే నిర్ణయించింది. ఇందుకోసం తితిదే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సు మేరకు మూడు సముదాయ భవనాల్లో ఉన్న గదులకు ఒక్కొక్క దానికి ఒక్క రోజుకు అద్దెను రూ.1000కి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే పాత ధరలతో రోజుకు రూ.5,09,500 వసూలయ్యే మొత్తం గురువారం నుంచి రూ.9.51 లక్షలకు పెరిగింది.దీనిపై మరింత చదవండి :