1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 7 మే 2016 (12:04 IST)

తితిదే ప్రాణదాన ట్రస్టు ద్వారా 40 మంది చిన్నారులకు వెన్నెముక శస్త్రచికిత్స

తిరుపతి తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిరుపేద చిన్నారులకు ఉచిత వెన్నెముక శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొంతమంది చిన్నారులు వెన్నెముక సమస్యలతో బాధపడుతూ వచ్చారు. వారికి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు.
 
గూని, వెన్నెముక వంకరతో బాధపడుతున్న 40 మంది చిన్నారులకు న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ ప్రసాద్‌ శస్త్రచికిత్స చేశారు. అత్యంత నైపుణ్యం గల స్విమ్స్ న్యూరోసర్జరీ బృందం వీటిని నిర్వహించినట్లు స్విమ్స్ నిర్వాహకులు తెలిపారు. 
 
కార్పొరేట్‌ వైద్యశాలలో ఇటువంటి శస్త్రచికిత్సలకు 10 నుంచి 15 క్షల రూపాయలు ఖర్చు అవుతుందని, అయితే తితిదే ప్రాణదాన పథకం ద్వారా ఉచితం నిర్వహించినట్టు వైద్య బృందం వెల్లడించింది.