ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (14:49 IST)

వారణాసిలోని ఆంధ్రా ఆశ్రమంలో ఇద్దరు అన్నదమ్ముల ఆత్మహత్య

suicide
ఏపీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇద్దరు అన్నదమ్ములు మోసపోయారు. దీంతో మనస్తాపానికి గురై వారణాసిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారణాసిలోని ఆంధ్రా ఆశ్రమంలో అద్దెకు తీసుకున్న గదిలో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంకు చెందిన ఈ అన్నదమ్ములను లక్ష్మీనారాయణ (34), వినోద్ (32)లుగా గుర్తించారు. 
 
గ‌తంలోనే వీరు క‌నిపించ‌డం లేద‌ని ఏపీలో మిస్సింగ్ కేసు నమోదైంది. వీరిద్ద‌రూ స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారంతో పాటు రియ‌ల్ ఎస్టేట్ చేసేవారు. అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ ఒకేసారి క‌నిపించ‌కుండా పోవ‌డం అప్ప‌ట్లో స్థానికంగా సంచ‌ల‌నం రేపింది. 
 
ఈ కేసు విష‌య‌మై పోలీస‌లు ద‌ర్యాప్తు చేస్తున్నారు. తాజా స‌మాచారం మేర‌కు.. వీరిద్ద‌రూ వార‌ణాసిలోని ఓ హిందు ఆశ్ర‌మంలో గ‌దిని అద్దెకు తీసుకుని అందులో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.
 
అయితే, తాజా స‌మాచారం మేర‌కు వీరిద్ద‌రూ వార‌ణాసిలోని ఓ హిందూ ఆశ్ర‌మంలో గ‌దిని అద్దెకు తీసుకుని అందులో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ మేర‌కు వార‌ణాసి పోలీసులు మృతుల బంధువుల‌కు స‌మాచారం అందించారు. ఈ ఆత్మ‌హ‌త్య‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.