శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (13:09 IST)

నేరేడు పండ్లు తిని ఇద్దరు చిన్నారుల మృతి.. ఆ పండ్లను కడగకుండా..?

Black Jamun
Black Jamun
నేరేడు పండ్లు తిని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా కోసిగిలో చోటుచేసుకుంది. మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా వుంది.

వివరాల్లోకి వెళితే..  కోసగి మూడో వార్డులో నాలుగు  రోజుల క్రితం బూగేని మాదేవి అనే మహిళ తన అత్త తెచ్చిన నేరేడు పండ్లను తన ఇద్దరు చిన్నారులు హర్ష, అంజిలకు ఇచ్చింది. వాళ్లతో పాటు ఆడుకుంటున్న మరో బాలుడు శ్రీరాములు కూడా ఆ పండ్లను తీసుకుని తిన్నాడు. 
 
కొన్ని పండ్లను చిన్నారుల తల్లి మాదేవి కూడా తింది. కానీ నలుగురు చిన్నారులు స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని కుటుంబీకులు ఆదోనీ ఆస్పత్రికి తరలించారు. కానీ నేరేడు పండ్లను తిన్న రోజే హర్ష అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందారు.

మంగళవారం అస్వస్థతకు గురైన చిన్నారుల్లో అంజి అనే నాలుగేళ్ల చిన్నారి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో నేరేడు పండ్లు తిని మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది.
 
క్రిమిసంహారక మందులకు సంబంధించిన కవర్‌లో నేరేడుపండ్లు తీసుకురాగా, ఆ పండ్లను కడగకుండా అలాగే తినడంతోనే ఇలా అస్వస్థతకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

బాధితుల శరీరంలోకి పాయిజన్ వెళ్లి వుంటుందని భావిస్తున్నారు. అందువల్ల ఎవరైనా పండ్లు తినేటప్పుడు నీటితో శుభ్రంగా కడుక్కుని తినాలని సూచిస్తున్నారు.