మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (19:26 IST)

సంతానప్రాప్తి కోసం రావిచెట్టు వద్ద ఇలా పూజ చేస్తే...?

Pipaal
సంతానం లేనివారు అనుభవించే క్షోభ వేరే చెప్పనక్కర్లేదు. సంతానం కోసం ఎన్నో పూజలు చేస్తుంటారు. నోములు నోస్తారు. వాటితో పాటు కొన్నింటిని ఆచరిస్తే తప్పక ఆ భగవంతుడు కరుణిస్తాడని విశ్వాసం. సంతానం కోసం ఎదురుచూస్తున్న మహిళ నల్లని ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఫలితం వుంటుందని అంటారు. ఈ సమయంలో తలపై చెయ్యి ఉంచుకుని ప్రదక్షిణ చేయాలి. తప్పకుండా సంతానప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.

 
స్త్రీలు ప్రతిరోజు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ, అక్కడ దీపారాధన చేస్తే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానప్రాప్తి కలగాలంటే వెదురు మెులకలను తీసుకొని దానితో శివలింగం చేసి పూజ చేయాలి. కొద్దికాలంలోనే సంతానప్రాప్తి కలుగుతుంది.

 
సంతానప్రాప్తి కోసం ఇష్టకామ్య సింధూర తిలకాన్ని ధరించండి. హనుమంతుని మందిరంలో రాగి దానం చేయండి. సంతానప్రాప్తి కోసం గోధుమపిండి ఉండలుచేసి, వాటిలో కొద్దిగా శనగపప్పు, పసుపు కలిపి ఆవుకు తినిపించండి. ఇవన్నీ చేస్తుంటే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని పండితులు చెపుతున్నారు.