Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ తింటున్న బాలుడి గొంతులో చిక్కుకున్న ముక్క.. చివరికి?

Written By సెల్వి
Updated: సోమవారం, 13 జనవరి 2020 (17:39 IST)
చిన్నపిల్లలకు మాంసాహారం ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు అధిక శ్రద్ధ తీసుకోవాలి. చేపలు కానీ, చికెన్ వంటివి పిల్లలకు పెడుతున్నప్పుడు.. అందులోని ముల్లు, ముక్కలను తొలగించి ఇవ్వడం చేస్తే పిల్లల గొంతులో అవి చిక్కుకుపోవు. తాజాగా ఓ బాలుడు ఇలా చికెన్ ముక్కను కొరుకుతూ వుండగా.. చికెన్ ఎముక గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆ బాలుడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. కానీ వైద్యులు చాకచక్యంగా బాలుడు గొంతులో ఇరుక్కున్న చికెన్ ఎముక ముక్కను తొలిగించారు. 
 
వివరాల్లోకి వెళితే.. లింగంపల్లికి చెందిన పదేళ్ల బాలుడు నాలుగు రోజుల క్రితం చికెన్ తింటుండగా గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోయింది. ఆహార నాళంలో ఇది అడ్డంగా ఇరుక్కుపోవడంతో బాలుడు బాధతో నానా తంటాలు పడ్డాడు. ఆపై కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు ఆ బాలుడికి చికిత్స చేశారు. పరీక్షల అనంతరం చాకచక్యంగా వ్యవహరించి గొంతులో ఇరుక్కున్న ఎముక ముక్కను వైద్యులు తొలగించారు. రెండు రోజుల తర్వాత ఈ చికెన్ ముక్కను బాలుడి గొంతు నుంచి తొలగించినట్లు వైద్యులు తెలిపారు. 
 
అనంతరం పలు పరీక్షల ద్వారా ఆహార నాళం మామూలుగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఇలాంటి కేసుల్లో నాళంలో ఇరుక్కున్న ఎముకను త్వరగా తీయకుంటే నాళానికి రంధ్రం ఏర్పడే ప్రమాదం ఉందని, కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశం కూడా ఉందని వైద్యులు హెచ్చరించారు. అందుచేత చిన్నారులకు మాంసాహారం అందించే పక్షంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని వైద్యులు సూచించారు. 

అన్నీ చూడండి

Venky Atluri :సూర్య గారిని దృష్టిలో ఉంచుకొని కథ రాయలేదు : వెంకీ అట్లూరి

అమీర్ లోగ్ కథ ఇప్పటి వరకు రాలేదు, హిట్టు బొమ్మ.. రమణా రెడ్డి సోమ

Vaishnavi : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య పై మధురమైన మూడో పాట విడుదల

A.R. Rahman: గెట్ రెడీ చెన్నై! ఆగ‌స్ట్ 23 నుంచి తొలి త‌మిళ ఐడిల్ ఆడిష‌న్స్

Aditi Shankar: అనుపమ పరమేశ్వరన్‌కు వత్తాసు పలికి అదితి శంకర్

తర్వాతి కథనం
Show comments