శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (09:22 IST)

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడం ఖాయం : కేంద్ర మంత్రి ఠాగూర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయడం ఖాయమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం మొగ్గు చూపిందని వెల్లడించారు. 
 
విశాఖలో ఉద్యోగులు, కార్మికుల ఆందోళనపై స్పందిస్తూ.. కొన్ని కం పెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత మెరుగైన ఫలితాలొచ్చాయని, ఉద్యోగుల వేతనాలు కూడా పెరిగాయన్నారు.నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. 
 
'ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును కేంద్రం ఎప్పటికప్పుడు మదింపు చేస్తుంది. ఏ కంపెనీకి సాయం అందిస్తే బలోపేతమవుతుందో అంచనా వేస్తుంది. కంపెనీలన్నీ అమ్మకానికి పెట్టడం లేదు' అని చెప్పారు. 
 
ఇకపోతే, పెట్రో ధరల తగ్గింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని తేల్చి చెప్పారు. కేంద్రం చేయాల్సిందంతా చేసిందని, ఎక్సైజ్‌ సుంకాన్ని కూడా తగ్గించిందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను బట్టి పెట్రో ధరల్లో మార్పులుంటాయని చెప్పారు. అందువల్ల ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని చెప్పారు.