1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (08:55 IST)

మిస్టర్ జైట్లీ... మీరూ.. మీ సర్కారు శాశ్వతం కాదు : సుజనా చౌదరి ఫైర్

భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకునే దిశగానే అధికార టీడీపీకి చెందిన ఎంపీలు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇందులోభాగంగా, బీజేపీ నేతలను టీడీపీ ఎంపీలు కడిగిపారేస్తున్నారు.

భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకునే దిశగానే అధికార టీడీపీకి చెందిన ఎంపీలు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇందులోభాగంగా, బీజేపీ నేతలను టీడీపీ ఎంపీలు కడిగిపారేస్తున్నారు. ముఖ్యంగా, పార్లమెంట్ ఆవరణలో తమను పలుకరించిన బీజేపీ నేతలందరినీ ఏకిపారేస్తున్నారు. ఇందులో చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా దులిపేస్తున్నారు. 
 
ముఖ్యంగా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై టీడీపీకి చెందిన మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తంచేశారు. మిస్టర్ జైట్లీ.. మీరూ.. మీ సర్కారు శాశ్వతం కాదంటూ హెచ్చరికలు చేశారు. అదీ కూడా ఒక్కసారి కాదు.. ఏకంగా రెండుసార్లు జైట్లీతో సుజనా చౌదరి వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. 
 
గత నాలుగు రోజులుగా పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సుజనా చౌదరితో అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, 'నేను రెండు సార్లు ప్రకటన చేశాను కదా.. ఇంకా సంతృప్తి చెందలేదా? ఎందుకు నిరసన తెలుపుతున్నారు' అంటూ ప్రశ్నించారు. 
 
దీనికి సుజనా కూడా ఘాటుగానే సమాధానమిచ్చారు. 'ఆ ప్రకటనలో ఏముంది? దాని వల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చేదేమీ లేదు. మభ్యపెట్టేదిగా ఉంది. మా ముఖ్యమంత్రి సంతృప్తి చెందలేదు. మీరు నంబర్లను కాదు మెంబర్లను గౌరవించాలి.. మీ ప్రభుత్వం శాశ్వతం కాదు.. అధికారం శాశ్వతం కాదు.. ఏపీలో ప్రజలు రగిలిపోతున్నారు.. మా ఆందోళన విరమించేది లేదు' అంటూ తేల్చి చెప్పారు. దీనికి జైట్లీ కూడా.. సరే మీయిష్టం.. ఆందోళనలు చేసుకోండంటూ ముక్తసరిగా చెప్పి వెళ్లిపోయారు.