గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , బుధవారం, 18 ఆగస్టు 2021 (15:28 IST)

ఎవ‌రీ వ్య‌క్తి? ఎందుకిలా? కాలువ‌లో కొట్టుకొస్తున్న శ‌వం

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కోడూరు మధ్య గల ప్రధాన పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొస్తోంది. ఇది నీటి ప్రవాహంతో కొట్టుకొని వస్తోంది.

మృతుడు నీలి రంగు జీన్స్ ప్యాంటు, నీలి రంగు గళ్ళ‌ చారల చొక్కా ధరించి ఉన్నాడు. ఈ మృతదేహం ఎవ‌రిది? ఎందుకిలా కాలువ‌లో ప‌డి ఉంది? ఇది ఆత్మ‌హ‌త్యా? లేక ఎవ‌రైనా హ‌త్య చేసి, శవాన్ని కాలువ‌లో ప‌డేశారా? అనేది ఇపుడు కోడూరు పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎవ‌రనేది ప‌రిశీలిస్తున్నారు.

దీనికి సంబంధించి ఇంత వ‌ర‌కు త‌మ‌కు ఎటువంటి ఫిర్యాదు రాలేద‌ని, ఎవ‌రైనా త‌మ వారు త‌ప్పిపోయి ఉంటే, వెంట‌నే ఈ గుర్తుల ఆధారంగా త‌మ‌కు ఫిర్యాదు చేయాల‌ని కోడూరు పోలీసులు చెపుతున్నారు. కృష్ణా జిల్లా పోలీసుల‌కు, లేదా 100 నెంబ‌రుకు కాల్ చేసి వివ‌రాలు తెల‌ప‌వ‌చ్చ‌ని పేర్కొంటున్నారు.