మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 17 డిశెంబరు 2018 (19:59 IST)

భక్తులూ.. వైకుంఠ ఏకాదశికి తిరుమలకు రాకండి.. ఎందుకు..?(Video)

వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం లోపలి నుంచి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే ప్రతి యేటా ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు చేరుకుంటుంటారు. ఈ యేడాది కూడా తిరుమలలో భక్తుల సంఖ్య విపరీతంగా కనిపిస్తోంది. లక్షలాదిగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. అయితే ఎప్పటిలాగే టిటిడి చేతులెత్తేసింది. సామాన్య భక్తులను గాలికొదిలేసింది.
 
పెథాయ్ తుఫాన్ కారణంగా ఒకవైపు చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో సామాన్య భక్తులు వణికిపోతూ రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు గదులు కూడా దొరక్కపోవడంతో తిరుమలలో ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. నాలుగు కిలోమీటర్ల మేర సర్వదర్శనం క్యూలైన్లు నిండిపోయి భక్తులు బయట పడిగాపులు కాస్తున్నారు.

కంపార్టుమెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. టిటిడి అధికారులు మాత్రం భక్తులు తిరుమలకు రావడంపై మరోసారి పునరాలోచించుకోవాలని కోరుతున్నారు. ఇదిలావుంటే తిరుమలలో గవర్నర్ నరసింహన్ అన్ని వీధులు తిరిగి భక్తులకు అందుతున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా చూశారు. చూడండి ఆ వీడియోను..