గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 28 నవంబరు 2018 (16:11 IST)

2.0 మరియు PSLV-C43... రెండూ ఒకేసారి, శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్(Video)

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్ శివన్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శివన్‌కు వేదపండితులు వేదశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. 
 
అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ...  పీఎస్‌ఎల్‌వీ-సీ43 విజయవంతం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. కాగా ఈ రాకెట్ రేపు ఉదయం గం. 9.58 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. మొత్తం 31 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సి43 రాకెట్‌ కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. మన దేశానికి చెందిన హైసిస్‌ ఉపగ్రహం, యూఎస్‌కు చెందిన 23 ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. కాగా రేపే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.O చిత్రం కూడా విడుదల కాబోతోంది. ఈ చిత్రం రాకెట్‌లా దూసుకెళ్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. చూద్దాం.