శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (13:51 IST)

ఇస్రోకు - జీశాట్ 6ఏకు సంబంధాలు తెగిపోయాయి...

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా ప్రయోగించిన జీశాట్-6ఏతో సంబంధాలు కోల్పోయినట్టు ఆ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ శాటిలైట్ నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని జీశాట్‌-6ఏను ప్రయోగించిన 48 గంటల

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా ప్రయోగించిన జీశాట్-6ఏతో సంబంధాలు కోల్పోయినట్టు ఆ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ శాటిలైట్ నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని జీశాట్‌-6ఏను ప్రయోగించిన 48 గంటల తర్వాత ఇస్రో తెలిపింది. ఈ ఉపగ్రహానికి సంబంధించి చివరిదైన మూడో లామ్‌ ఇంజిన్‌ను మండించిన సమయం నుంచి దానితో అనుసంధానం కోల్పోయామని ఇస్రో తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
 
కాగా, భారత్‌ అభివృద్ధి చేసిన రాకెట్లలో రెండో అతిపెద్దదిగా పేరు గాంచిన జీశాట్‌-6ఏ ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. ప్రయోగం జరిగిన తర్వాత రాకెట్‌ నిర్ణీత కక్ష్యలో జీశాట్‌-6ఏ ఉపగ్రహాన్ని చేర్చడానికి 17 నిమిషాల సమయం పట్టింది. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లోనే ఇది 12వది. 
 
అయితే, ఈ శాటిలైట్ ప్రయోగించిన తర్వాత అంటే మార్చి 30న ఉదయం 9.22 నిమిషాలకు సమాచారం అందింది. మొదటిసారి కక్ష్య పెంపు ప్రక్రియ చేపట్టిన సమయంలో అది సమాచారాన్ని చేరవేసిందని తెలిపింది. ఆ తర్వాత రెండోసారి కక్ష్య పెంపును మార్చి 31న చేపట్టినట్లు తెలిపింది. ఉపగ్రహంతో అనుసంధానం కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇస్రో అధికారులు వెల్లడించారు.