గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Updated : బుధవారం, 11 ఏప్రియల్ 2018 (10:15 IST)

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మైన్ శివన్

తిరుమ‌ల శ్రీవారిని ఇస్రో ఛైర్మెన్ శివ‌న్ బుధవారం ద‌ర్శించుకున్నారు. గురువారం (ఏప్రిల్ 12) ఉదయం 4.04 నిముషాలుకు పీఎస్‌ఎల్వీ సి-41 ప్రయోగం జరుగనుంది. దీంతో ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం అవ్వాల‌ని కోరుతూ ఇస్రో ఛ

తిరుమ‌ల శ్రీవారిని ఇస్రో ఛైర్మెన్ శివ‌న్ బుధవారం ద‌ర్శించుకున్నారు. గురువారం (ఏప్రిల్ 12) ఉదయం 4.04 నిముషాలుకు పీఎస్‌ఎల్వీ సి-41 ప్రయోగం జరుగనుంది. దీంతో ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం అవ్వాల‌ని కోరుతూ ఇస్రో ఛైర్మెన్ శివన్ శ్రీవారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ శాటిలైట్‌తో నావిగేషన్ ద్వారా విస్తృత‌మైన‌ సేవలు అందించవచ్చు. 
 
గత ప్రయోగంలో శాటిలైట్‌తో సంభంధాలు తెగిపోవడంతో పునరుద్దరించడానికి ప్రయత్నాలు చేస్తూన్నాం అని ఇస్రో ఛైర్మైన్ శివ‌న్ తెలిపారు. ఇదిలాఉంటే... తిరుమల కొండపై బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 
 
శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పట్టనుంది. మంగళవారం శ్రీవారిని 66,436మంది భక్తులు దర్శించుకున్నారు.