శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (19:49 IST)

ముగిసిన వంగవీటి రాధా నిశ్చితార్థం.. అక్టోబరులో పెళ్ళి

vangaveeti radhd engagement
టీడీపీ నేత వంగవీటి రాధా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన నిశ్చితార్థం ఆదివారం జరిగింది. జక్కం పుష్పవతితో రాధా నిశ్చితార్థం ఆదివారం నరసాపురం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల వారు హాజరై కాబోయే దంపతులను దీవించారు. ఈ నిశ్చితార్థం నరసాపురంలో పెద్దల సమక్షంలో జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరావు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. 
 
కాగా, వంగవీటి రాధా చేసుకోబోయే జక్కం పుష్పవల్లి స్వస్థలం నరసాపురం పట్టణం. ఏలూరు మాజీ మున్సిపల్ ఛైర్మన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల చిన్న కుమార్తె పుష్పవల్లి. వంగవీటి రాధా, పుష్పవల్లిల వివాహం అక్టోబరులో జరుగనుంది. కాగా, చాలాకాలంగా బ్యాచిలర్‌గా ఉన్న వంగవీటి రాధా ఎట్టకేలకు ఇంటివాడు కాబోతుండటంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.