ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2024 (10:37 IST)

చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌

YSRCP MLC Iqbal
YSRCP MLC Iqbal
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ బుధవారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత ఇక్బాల్‌ను పార్టీలోకి స్వాగతించారు. గత వారం, రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి వైఎస్సార్‌సీపీ పార్టీలో అసంతృప్తిగా వున్నందున ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 
 
శాసనమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం 2027 మార్చిలో ముగియనుంది. రాయలసీమ రేంజ్ మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ 2018లో వైకాపాలో చేరారు. హిందూపూర్ నియోజకవర్గంలో నటుడు, టీడీపీ నాయకుడు బాలకృష్ణపై వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి విఫలమయ్యారు. 
 
2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. హిందూపురం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా తిప్పేగౌడ నారాయణ్‌ దీపికను ఎంపిక చేయడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. 
 
కర్నూలు జిల్లాకు చెందిన ఇక్బాల్ అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు శాఖలో పలు కీలక పదవులు నిర్వహించారు. 1995, మరియు 2000 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. 2018లో పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు.