గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 10 ఏప్రియల్ 2024 (23:38 IST)

పోలవరం ఎంతవరకు వచ్చింది అంటే అంబటి డ్యాన్స్ వేస్తారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan- Chandrababu
కర్టెసి-ట్విట్టర్
తణుకులో తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారాన్ని ప్రారంభించారు. భారీ జనవాహినినుద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ''పోలవరం పూర్తి అయిందా అని అడిగితే ఆ మంత్రి "ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా" అని డాన్స్ వేస్తాడు. ఇదీ వారి పాలన. ఏపీ అభివృద్ధి కోసం మేము తగ్గాము త్యాగాలు చేసాం, మా స్వార్థం కోసం కాదు, మీ భవిష్యత్తు కోసమే. పొత్తులను మీరు వ్యతిరేకిస్తే మాకే నష్టం జరగదు, నష్టపోయేదంతా మీరే'' అని అన్నారు.
 
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. యువతను జగన్ దారుణంగా మోసం చేసాడు. డీఎస్సీ లేదు. జాబ్ క్యాలెండర్ లేదు. పోటీ పరీక్షల కోసం కష్టపడి చదువుకున్న నిరుద్యోగుల శ్రమ, కాలం, డబ్బు... అన్నీ వృధా చేసాడు. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తానని హామీ ఇస్తున్నా. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను గానీ తెలుగుదేశం పార్టీ గానీ ఎప్పటికీ ఆయనను గుర్తుపెట్టుకుంటాం'' అన్నారు.