బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (22:47 IST)

Pawan Kalyan speech క్లైమోర్ మైన్ దాడిలో 16 అడుగులు ఎత్తున ఎగిరి పడినా లేచి నడిచారు బాబు: పవన్ కల్యాణ్

Pawan Kalyan- Chandrababu
తాడేపల్లిగూడెంలో జరిగిన తెదేపా-జనసేన ఉమ్మడి జెండా సభలో పాలక పార్టీ వైసిపి, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు జనసేన అధినేత పవర్ స్టార్ (Pawan Kalyan) పవన్ కల్యాణ్. తెదేపాతో పొత్తు గురించి మాట్లాడుతూ... క్లైమోర్ మైన్ దాడిలో, 16 అడుగులు ఎత్తున ఎగిరి పడినా, చొక్కా దులుపుకొని, రండి రాజకీయాలు చేద్దాం అన్న వ్యక్తి చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ఒక రాజకీయ దురంధరుడు అని అన్నారు.
 
రాష్ట్రాభివృద్ధి గురించి, యువత సమస్యలు గురించి మాట్లాడని జగన్... నా వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ప్రతి సభలో మాట్లాడుతారని మండిపడ్డారు. తనకు నలుగురు పెళ్లాలనీ, రెండు విడాకులు అని అంటుంటారనీ, ఐతే నాకైతే మూడు పెళ్లిళ్లు జరిగి రెండు విడాకులయ్యాయన్నారు. ఐతే నాకు నాలుగో పెళ్లాం వుందంటూ జగన్ అంటున్నారనీ, నాకైతే నా నాలుగో పెళ్లాం జగనే అనుకుంటున్నానంటూ ఎద్దేవా చేసారు.
 
ఇంకా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ''జగన్... నీ కోటలు బద్ధలు కొడతాం. జగన్ సిద్ధం సిద్ధం అంటూ ఏ మూలన చూసినా హోర్డింగులు పెట్టుకుంటున్నాడు. ఇక యుద్ధం చేస్తేనే కింద కూర్చుంటాడు. జనసేన 24 సీట్లు తీసుకుంటే ఇంతేనా అన్నారు, బలిచక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నాడు. అధఃపాతాళానికి తొక్కుతుంటే అప్పుడు అర్థమైంది. త్వరలో అది జగన్ రెడ్డికి కూడా అర్థమవుతుంది.
 
నన్ను విమర్శించేవారికి దేశం కోసం కన్నీళ్లు కార్చే ఓపిక వుందా? మీరు కనుక నా మద్దతుదారులైతే నాతో నడవండి? 24 సీట్లు తీసుకున్నాడంటూ విమర్శలు వద్దు. 50 సీట్లు తీసుకుంటే ఓట్లు వేయించేందుకు అన్ని నియోజకవర్గాల్లో కేడర్ వుందా, ప్రతి నియోజకవర్గంలో తిరిగేందుకు డబ్బులు వున్నాయా... వేలకు వేల కోట్లు జనం సొమ్మును వెనకేసుకుని కూర్చున్న వైసిపి పార్టీ కాదు జనసేన. కష్టంతో నేను ఆర్జించిన డబ్బుతో నడుస్తుంది. అందుకే కిందిస్థాయి నుంచి పటిష్టంగా అడుగులు వేస్తున్నాం. అందుకే 4 దశాబ్దాల రాజకీయ అనుభవం, అభివృద్ధి చేయగల చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నాం. పవన్ కళ్యాణ్‌తో స్నేహం అంటే చచ్చేదాకా వుంటుంది.
 
ఈ రాష్ట్రాన్ని అధోగతిపాల్జేసిన జగన్ మోహన్ రెడ్డి పార్టీ పరాజయానికి ఈ సభ నుంచి మహాయుద్ధానికి శంఖారావం పలుకుతున్నా. పొత్తు గెలవాలి జగన్ పోవాలి'' అంటూ ప్రసంగం ముగించారు.