ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (20:40 IST)

ఒకే వేదికపై పవన్- బాలయ్య.. ఫ్యాన్స్ ఖుషీ

pawan_balakrishna
pawan_balakrishna
తెలుగుదేశం, జనసేన కూటమికి స్టార్ క్యాంపెయినర్లు అయిన పవన్ కళ్యాణ్-నందమూరి బాలకృష్ణ తాడేపల్లిగూడెంలో జరిగిన భారీ రాజకీయ సమావేశంలో వేదికను పంచుకున్నారు. పవన్, బాలకృష్ణ కలిసి నిలబడిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
బాలకృష్ణ తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి వేదికపైకి రాగా, పవన్ తన కుర్చీలోంచి లేచి బాలకృష్ణ వైపుకు వెళ్లి పక్కనే నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ సీన్ జనసేన-తెలుగుదేశం ఫ్యాన్స్‌కు పండగలా మారింది. ఈ ఘటనపై బాలకృష్ణ చాలా పాజిటివ్‌గా స్పందించడంతో పవన్‌తో పాటు ఆయన కూడా ఎనర్జీగా కనిపించారు.