సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (19:27 IST)

అందుకే పవన్ కల్యాణ్-నేనూ చేతులు కలిపాము: తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు

TDP, Janasena meeting
తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన ఉమ్మడి సభలో చంద్రబాబు నాయుడు వైసిపి పాలనపై మండిపడ్డారు. అరాచక పాలన సాగిస్తున్నారనీ, అహంకారంతో రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించారని అన్నారు. ఐదుకోట్ల ఆంధ్రుల అభివృద్ధి కోసం జనసేన-టీడీపి చేతులు కలిపాయని వెల్లడించారు.
 
ఏపీని వైసిపి కబంధ హస్తాల నుంచి విముక్తి చేసేందుకు పవన్-నేను చేతులు కలిపామని అన్నారు. ఇది జనం కలిపిన పొత్తు అనీ, ఈ పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులు నింపుతుందని, త్వరలో రాష్ట్రంలో నవోదయం రాబోతోందని అన్నారు. ఈ సభ టీడీపి-జనసేన గెలుపు సభ అని చెప్పారు. కాగా సభకు జెండా అని నామకరణం చేసారు. పెద్దఎత్తున టీడీపి-జనసేన కార్యకర్తలు హాజరయ్యారు.