గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (13:49 IST)

హనుమ విహారికి అన్యాయం చేసి 'ఆడుదాం ఆంధ్రా'తో లాభమేంటి?: పవన్ ప్రశ్న

pawan kalyan
భారత క్రికెట్ ఆటగాడి కంటే వైసిపి నాయకుడే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కి ముఖ్యమా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జట్టు కోసం హనుమ విహారీ తన గాయాలను సైతం లెక్కచేయకుండా శ్రమించి ఆడారని, అలాంటివారికి ఇచ్చే బహుమతి ఇదా అని ప్రశ్నించారు.
 
ఇంకా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... హనుమ విహారి తన కెప్టెన్సీకి రాజీనామా సమర్పించడానికి కారణం వైసిపి నాయకుడే కారణమని అన్నారు. క్రికెట్ టీమ్ కెప్టెన్ హనుమ విహారిని ఘోరంగా అవమానించి ఆడుదాం ఆంధ్రా అంటూ కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం వల్ల ఎవరికి లాభం అంటూ ప్రశ్నించారు. హనుమ విహారి తప్పకుండా వచ్చే ఏడాది గౌరవించడం తెలిసిన స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి తిరిగి ఆడుతారని ఆశాభావం వ్యక్తం చేసారు.