శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (21:19 IST)

టాలెంట్ సెర్చ్‌.. "ఆడుదాం ఆంధ్రా'' కోసం.. తొమ్మిది సంస్థలతో డీల్

Adudam Andhra
Adudam Andhra
క్రీడాకారుల కోసం టాలెంట్ సెర్చ్‌కు ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 'ఆడుదాం ఆంధ్రా''లో భాగంగా ఏపీ ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. యువతలో క్రీడలను ప్రోత్సహించే విధంగా తొమ్మిది సంస్థలతో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. కాగా, మరో రెండు సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి. 
 
చెన్నై సూపర్ కింగ్స్, ప్రో కబడ్డీ లీగ్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, ప్రైమ్ వాలీబాల్ లీగ్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్, పీవీ సింధు, ఆంధ్రా ఖో ఖో అసోసియేషన్, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్, ఆంధ్రా వాలీబాల్ అసోసియేషన్‌తో ఒప్పందాలు చేసుకుంది. ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్‌తో చర్చలు సాగుతున్నాయి.
 
సుమారు 50 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే గ్రామ,వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి.