ఉల్లిగడ్డని 'Potato' అంటారు కదా.. జగన్‌పై సెటైర్లు మొదలు..
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ట్రోల్స్ మొదలైయ్యాయి. ఉల్లిగడ్డను ఇంగ్లీషులో పొటాటా అంటారు కదా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఉల్లిగడ్డ వ్యాఖ్యలపై సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్‌కు వీటి మధ్య తేడా కూడా తెలియదా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి.
పొటాటోను తెలుగులో ఏమంటారు అంటూ అధికారులను జగన్ అడగటంతో వారంతా ముక్కున వేలేసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తుపాను సహయం కోసం తిరుపతి జిల్లా వాకాడు మండలంలో పర్యటించారు.
ఈ సందర్భంగా సీఎం ఆలుగడ్డ, ఉల్లిగడ్డ కామెంట్స్ చర్చకు దారి తీశాయి. దీంతో ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎం అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి.