మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (08:28 IST)

విద్యార్థులకు చేదువార్త ... జగనన్న విద్యా దీవెన డబ్బుల జమ వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న విద్యా దీవెన ఒకటి. ఈ పథకం కింద విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్  డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇందులోభాగంగా, మంగళవారం ఈ డబ్బులు జమ చేయాల్సివుంది. అయితే, ఈ రోజు ఈ నిధులను జమ చేయడం లేదు. 
 
దీనికి కారణం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే ప్రభుత్వ కార్యాలయంలో సీఎం జగన్ పాల్గొనాల్సివుంది. 
 
ఈ కారణంగా జగనన్న విద్యా దీవెన పథకాన్ని తాత్కాలికంగా ప్రభుత్వం వాయిదావేసింది. కాగా, జగనన్న విద్యా దీవెన పథకం అమలు కొత్త తేదీని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని అధికారులు వెల్లడించారు.