శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 23 డిశెంబరు 2021 (19:03 IST)

గురు స్పందన అవార్డు గ్రహీత నల్లమల్లి కుసుమకు అభినంద‌న‌

విజయవాడ నగరపాలక సంస్థ జిడిఇటి మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో పని చేస్తున్న‌ నల్లమల్లి కుసుమ గురువారం విజయవాడ నగరపాలక సంస్థ అడిషినల్ కమిషనర్ డా.జె. అరుణని మర్యాద పూర్వకంగా ఆమె ఛాంబర్లో కలిసారు. ఆమె స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు కాకినాడలో నిర్వహించిన టీచర్స్ రిలేషన్ షిప్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ నేషనల్ development (TREND) సదస్సులో బి.సి సంక్షేమ శాఖా మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ చేతుల మీదగా “ గురు స్పందన “ అవార్డు అందుకున్నారు. ఒత్తిడి లేని విద్య, సరళమైన బోధనా విధానం, స్నేహపూర్వక వాతావరణ, సమాజ పరిస్ధితుల పట్ల విద్యార్ధులకు కలిగిస్తున్న అవగాహన వలన ఆమె ఈ అవార్డు అందుకున్నట్లు వివరించారు. 

                                                                                                                                                        ఈ సందర్బంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, ఉత్తమ అభిరుచి కలిగి, వృత్తి పట్ల అంకిత భావంతో విద్యార్ధులలో సృజనాత్మకతను వెలికితీసి వారిలోని ప్రతిభను మెరుగుపరచే ఉపాధ్యాయిని కుసుమ లాంటి వారు విజయవాడ నగరపాలక సంస్థలో పని చేయ‌డం అభినందనియమని కొనియాడారు.