ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , బుధవారం, 29 సెప్టెంబరు 2021 (14:48 IST)

సచివాలయ వ్యవస్థ మాకు కూడా తెలియదు.. ఇది జగన్ వినూత్నఆలోచన

కొత్త‌గా ఎన్నిక‌యిన ఉప స‌ర్పంచులు, వార్డు సభ్యుల‌కు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ప్రారంభించారు. వారంతా ఎలా న‌డుచుకోవాలో తెలిపే వార్డు సభ్యులు- ఉపసర్పంచుల కరదీపికలను మంత్రి ఆవిష్కరించారు. జగన్ ప్రజాస్వామ్యాన్ని ఎలా గౌరవిస్తున్నారో ఈ ఎన్నికలే నిదర్శనమ‌ని, చంద్రబాబు ఎప్పుడూ కుట్రపూరితమేన‌ని, కాలపరిమితి అయిపోయినా ఎన్నికలు జర‌పలేద‌ని ఆరోపించారు. ల‌క్షా 30 వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామ‌ని, రెండు రోజులపాటు ఉపసర్పంచులు-వార్డు సభ్యులకు ఈ శిక్షణా తరగతులు జరుగుతున్నాయ‌ని వివ‌రించారు. 
 
అక్టోబర్ 2 న‌ రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ చేతుల మీదుగా స్వచ్ఛ సంకల్పాన్ని ప్రారంభిచబోతున్నామ‌ని, అభివృద్ధి-సంక్షేమం రెండూ, రెండు కళ్లుగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల‌న్నారు. గ్రామ సచివాలయాల ద్వారా 750 పౌర సేవలు అందిస్తున్నామ‌ని మంత్రి చెప్పారు. కొంత మంది ఆస్తి పన్ను ఎగవేస్తున్నార‌ని, కొత్తగా యాప్ ని కూడా తీసుకువచ్చామ‌ని తెలిపారు. సచివాలయ వ్యవస్థ అంటే మాకు కూడా తెలియదు.. ఇది జగన్ వినూత్నఆలోచన అని పెద్దిరెడ్డి కొనియాడారు. 
 
గత ప్రభుత్వంలో పేదలకు సమన్యాయం జరగలేద‌ని, ఈ ప్రభుత్వం అది చేసి చూపుతుంద‌న్నారు. మాజీ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, సచివాలయాల ద్వారా ప్రజలకు అన్నిసేవలు అందుతున్నాయ‌ని, ప్రభుత్వం చేస్తున్న గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల‌ని కోరారు. సీఎం జగన్ అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తున్నార‌ని, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటార‌న్నారు. నాలాంటి వాళ్ళకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక దిక్చుచి, జగన్ ప్రతి ఆలోచనల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భాగస్వామ్యులు అని పార్ధ‌సార‌ధి కొనియాడారు.