శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (13:57 IST)

విశాఖపట్నంలో గిరినాగు.. 12 అడుగుల పొడవు.. పరుగులు పెట్టిన జనం

Snake
ఏపీలో విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల గ్రామంలో గిరినాగు కలకలం రేపింది. కొత్త అమావాస్య సందర్భంగా ప్రజలంతా నూకాలమ్మ కాలనీలో నూకాలమ్మ జాతరలో వుండగా స్థానికంగా ఓ ఇంటి గోడ వెంబడి గిరినాగు ప్రత్యక్షమైంది. 
 
పామును చూసిన వారు.. ఆ దారిలో గుంపులుగా వెళ్తున్న జనం భయంతో పరుగులు తీశారు. వెంటనే తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో చోడవరం ఫారెస్టు రేంజర్‌ రామ్‌ నరేష్‌ బిర్లాంగి మాడుగులకే చెందిన స్నేక్ క్యాచ్చర్ వెంకటేశ్‌తో కలిసి ఘటనా ప్రాంతానికి వచ్చారు. 
 
వెంకటేశ్‌ గిరి నాగును పట్టుకొని తాటిపర్తి పంచాయతీ శివారులోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. గిరి నాగులు చూడటానికి భయంకరంగా ఉంటాయని, కానీ ఎలాంటి హాని చేయవని అటవీ అధికారులు తెలిపారు. ఈ గిరి నాగును కర్రలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా అలాంటి పాము జాతులను కనుగొంటే, వారు వెంటనే అటవీ అధికారులకు తెలియజేయాలి. ఈ పాము 12 అడుగుల పొడవు వుందని అధికారులు తెలిపారు.