గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (11:39 IST)

మద్యం సేవించిన భార్య.. చంపేసిన భర్త... ఎక్కడ?

కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్త ఒకరు.. అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. మద్యం సేవించందన్న ఒకే ఒక్క కారణంతో భార్యను కత్తితో పొడిచి భర్త చంపేశాడు. ఈ దారుణ ఘటన విశాఖపట్టణం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పాచిపెంట మండలం మాముతూరు గ్రామంలో శోభన్, తులసిలు పామాయిల్ తోటలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 
 
శనివారం ఉదయం తన తల్లి రావడంతో తులసి ఆమెతో కలసి సాలూరుకు వెళ్లింది. తిరిగి సాయంత్రం వచ్చిన ఆమె పూటుగా మద్యం సేవించి వుండటంతో శోభన్ ఆమెను మందలించాడు.
 
ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శోభన్, తన భార్యను ఇంటికి కాస్తంత దూరం తీసుకెళ్లి, ఓ కర్రతో మొహంపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన తులసి అక్కడికక్కడే మరణించింది. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేశారు. శోభన్ ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.