సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2022 (09:06 IST)

'మిసెస్ ఆసియా' విజేతగా విశాఖకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి

saroja alluri
అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో జరిగిన మిసెస్ ఆసియా పోటీల్లో విశాఖపట్టణానికి చెందిన ఇద్దరు పిల్లల తల్లి విజేతగా నిలించారు. ఈ పోటీలు ఈ నెల 19వ తేదీన జరిగాయి. ఇందులో అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న సరోజ అనే వివాహిత పాల్గొని విజేతగా నిలిచింది. తద్వారా ఈ కిరీటాన్ని అందుకున్న తొలి సౌత్ ఇండియన్ మహిళగా గుర్తింపు పొందారు. 
 
అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న సరోజకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా కలిసా లాస్‌ఏంజెల్స్‌లో ఉంటున్నారు. అయితే, స్వతహాగా ఫ్యాషన్ డిజైనర్ అయిన సరోజ.. మంచి డ్యాన్సర్ కూడా. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా సఖినేటిపల్లికి చెందిన సరోజ తల్లిదండ్రులు రాంబాబు, పార్వతి ఉద్యోగ రీత్యా విశాఖలో స్థిరపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన కాలిఫోర్నియాలో జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న సరోజ.. మిసెస్ ఆసియా అందగత్తెగా విజయం సాధించారు. అలాగే, మిసెస్ పాప్యులారిటీ, పీపుల్స్ చాయిస్ అవార్డులు కూడా దక్కించుకున్నారు.