మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (12:33 IST)

ఏపీలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ నిధుల విడుదల

input subsidy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సోమవారం విడుదల చేశారు. ప్రకృతి విపత్తుల వల్ల జరిగే నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు వీలుగా ఆయా ప్రభుత్వాలు క్రమం తప్పకుండా పరిహారం అందజేస్తున్నాయి. ఇందులోభాగంగా, గత సెప్టెంబరు నెలలో వచ్చిన గులాబ్ తుఫాను కారణంగా 34,586 మంది రైతులు తమ పంటను నష్టపోయారు. వీరందరికీ రూ.22 కోట్లను పరిహారగా మంగళవారం ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. 
 
గతంలో 2019-20 నుంచి 2021 సెప్టెంబరు నెల వరకు ఏపీ సర్కారు రైతులకు ఐదుసార్లు ఇన్‌పుట్ సబ్సీడీని అందజేసింది. 17.99 లక్షల ఎకరాల్లో పంటను నష్టపోయిన 13.96 లక్షల మంది రైతులకు 1,07,056 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసింది. ప్రభుత్వ నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.