శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం పర్యటిస్తున్నారు. ఈ జిల్లాలోని నర్సన్నపేటలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీసర్వే) పత్రాల పంపిణీని ప్రారంభించనున్నారు.
ఇఁదుకోసం జగన్ తాడేపల్లి నుంచి బుధవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు నర్సన్నపేట ప్రభుత్వం జూనియర్ కాలేజీ మైదానానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమాలన్ని పూర్తి చేసుకుని మధ్యాహ్నం 1.25 గంటలకు బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం జగన్ జిల్లా పర్యటన సందర్భంగా గట్టి భద్రతను కల్పించారు. అలాగే, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిఘా సారించారు. సీఎం వస్తుండటంతో విపక్ష నేతలను హౌస్ అరెస్ట్ చేయడం విమర్శలకు దారితీసింది.